News April 15, 2025
పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి శుభ్రం చేశారు. తిమ్మాపురంతో పాటు, మోదీన్పురం పరిసర గ్రామాల నుంచి శివభక్తులు అక్కడకు చేరుకుని క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.
Similar News
News November 4, 2025
అష్టైశ్వర్యాలు అంటే ఏంటి?

పెద్దలు మనల్ని దీవించేటప్పుడు ‘అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు’ అని అంటారు. మరి ఆ అష్టైశ్వర్యాలేంటో మీరెప్పుడైనా ఆలోచించారా? ఐశ్వర్యం అంటే సంపద. అష్ట అంటే 8. అందుకే అష్టైశ్వర్యాలంటే డబ్బే అనుకుంటారు. కానీ, కాదు. రాజ్యం, ధనం, ఇల్లాలు, సంతానం, ధైర్యం, ఆత్మస్థైర్యం, విద్య, వినయం.. ఇవే 8 ఐశ్వర్యాలు. మన జీవితం ఆనందంగా ఉండాలంటే కావాల్సినవి ఇవే. డబ్బు కాదు. అందుకే ఇవి కలగాలని పెద్దలు మనల్ని అలా జీవిస్తారు.
News November 4, 2025
ఇక టార్గెట్ టీ20 వరల్డ్ కప్

భారత మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. వన్డే వరల్డ్ కప్ కలను నెరవేర్చుకున్న ఉమెన్ ఇన్ బ్లూ ముందు మరో లక్ష్యం ఉంది. అదే T20 వరల్డ్ కప్. ఇప్పటివరకు జరిగిన 9 సీజన్లలో ఆస్ట్రేలియా(5), ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ విజేతగా నిలిచాయి. 2020లో రన్నరప్గా నిలవడమే టీమ్ ఇండియాకు ఉత్తమ ప్రదర్శన. ప్రస్తుతం మూడో ర్యాంకులో ఉన్న ఇండియా వచ్చే ఏడాది జరిగే WCను గెలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
News November 4, 2025
వరి పంటను ముందే కోస్తే ఏం జరుగుతుంది?

వరి పంటను ముందుగా కోసినట్లయితే ధాన్యంలో పచ్చి గింజలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక, కంకిలోని చివరి గింజలు పూర్తిగా నిండుకోక చాలా సన్నగా పొట్ట తెలుపు కలిగి ఉంటాయి. దీని వల్ల మిల్లింగ్ చేసినప్పుడు నిండు గింజల దిగుబడి తగ్గి అధికంగా నూక, తౌడు వస్తాయి. గింజలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పంటను సకాలంలో కోత కోయక పోతే గింజలు ఎక్కువగా ఎండి రాలిపోవడమే కాకుండా పగుళ్లు ఏర్పడతాయి.


