News January 31, 2025

పొలం పనుల్లో రఘువీరారెడ్డి

image

మంత్రి, పీసీసీ చీఫ్‌గా పనిచేసి ప్రజలందరికీ సుపరిచితులైన రఘువీరారెడ్డి పొలం పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. మడకశిర మండలం నీలకంఠాపురంలోని తన పొలంలో రైతుగా మారారు. పంటలోని కలుపు మొక్కలను యంత్రంతో స్వయంగా తొలగించారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ సమయం దొరికినప్పుడు సామాన్యుడిలా  జీవనం కొనసాగిస్తూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇటీవల ఆయన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సాగించారు.

Similar News

News November 21, 2025

నేషనల్ న్యూస్ రౌండప్

image

* జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు సౌతాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ
* బిహార్‌లో 27 మంది మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం నితీశ్.. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీకి హోంశాఖ కేటాయింపు
* శబరిమల గోల్డ్ చోరీ కేసు.. బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ అరెస్ట్
* డిసెంబర్ 4న సేలంలో నిర్వహించ తలపెట్టిన TVK విజయ్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

News November 21, 2025

ఖమ్మం: ‘సీడ్స్ ప్రొడక్షన్ చేస్తున్న ఆర్గనైజర్ల‌పై చర్యలు తీసుకోండి’

image

ఉమ్మడి జిల్లాలో ఆడ, మగ మొక్కజొన్న సీడ్స్ ప్రొడక్షన్ చేస్తున్న ఆర్గనైజర్ల విషయంపై వ్యవసాయ శాఖ కమిషనర్ గోపికి భారతీయ గోర్ బంజారా పోరాట సమితి అధ్యక్షుడు రవిచందర్ ఫిర్యాదు చేశారు. అమాయక గిరిజనులను లక్ష్యంగా చేసుకొని, అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తూ నష్టపరుస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

News November 21, 2025

శ్రీకాకుళం: ‘టెన్త్ పరీక్షల రాసే విద్యార్థులకు గమనిక’

image

టెన్త్ పరీక్షలకు వయసు చాలని విద్యార్థుల కండోనేషన్ ఫీజుకు వివరాలను సరి చూసి చెల్లించాలని DEO రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 31.08.2025 నాటికి 14 సంవత్సరాలు నిండని విద్యార్థుల https://ose.ap.gov.in వెబ్ సైట్‌లో వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల యాజామాన్యం ఈ విషయాన్ని గమనించాలని, ఎటువంటి అపరాధ రుసుం లేకుండా టెన్త్ పరీక్షల ఫీజును నవంబర్ 30లోగా చెల్లించాలన్నారు.