News April 12, 2025

పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ముగ్గురు కోనసీమ నేతలు

image

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీని శనివారం పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. నూతన కమిటీలో కోనసీమ జిల్లాకు ప్రాధాన్యం కల్పించారు. ఈ జిల్లాకు చెందిన ముగ్గురికి స్థానం కల్పించారు.  పిల్లి సుభాష్ చంద్రబోస్,  తోట త్రిమూర్తులు, పినిపె విశ్వరూప్ కు అవకాశం కల్పించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

Similar News

News October 30, 2025

సికింద్రాబాద్.. మరిన్ని రైళ్లు CANCEL

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లను పార్షికంగా రద్దు చేస్తున్నట్లు SCR ప్రకటించింది. గుంటూరు సికింద్రాబాద్ 12705 పూర్తిగా క్యాన్సిల్ చేశారు. సికింద్రాబాద్- గుంటూరు రైలును 12706 వరంగల్ నుంచి గుంటూరు మధ్యలో క్యాన్సిల్ చేశారు.12701 గుంటూరు- సికింద్రాబాద్ రైలు డోర్నకల్ సికింద్రాబాద్ మధ్యలో క్యాన్సిల్ చేశారు.

News October 30, 2025

వనపర్తి జిల్లాలో 5 బ్లాక్ స్పాట్లు..!

image

జాతీయ రహదారి-44 రక్తసిక్తం అవుతోంది. ఇటీవలే కర్నూలులో జరిగిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. వాహన చోదకుల అతివేగం, ఓవర్ టెక్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని జాతీయ రహదారి నిర్వాహకులు పోలీసులు పేర్కొంటున్నారు. వనపర్తి జిల్లాలో వెల్టూరు ఎక్స్ రోడ్స్, కనిమెట్ట, మదర్ థెరిసా కూడలి, అమడబాకుల కూడలి, తోమాలపల్లి ప్రాంతాలను జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లుగా అధికారులు గుర్తించారు.

News October 30, 2025

గుమ్మడి కాయలను ఎప్పుడు కోస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి?

image

గుమ్మడి పంట నాటిన 75 నుంచి 80 రోజులకు గుమ్మడి తీగపై కాయలు ఏర్పడతాయి. లేత కాయలు త్వరగా చెడిపోతాయి. కాబట్టి బాగా ముదిరి, పండిన కాయలనే కోయాలి. ముదిరిన కాయలు 4 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి ఎంత దూరపు మార్కెట్‌కైనా సులభంగా తరలించవచ్చు. కాయల్ని తొడిమతో సహా కోసి, కొన్ని రోజుల పాటు ఆరనివ్వాలి. కోసిన కాయలను శుభ్రపరచి సైజులను బట్టి గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు పంపాలి.