News September 5, 2024
పోక్సోకేసులో 20 ఏళ్లు జైలు శిక్ష
ఓ యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి ఆనందిని తీర్పునిచ్చారు. పెద్ద అగనంపూడిలో నివాసం ఉంటున్న బాలిక (13) 2021లో ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి కిందపడి మృతిచెందింది. ఈ కేసులో ఎదురు అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న విజయనగరం జిల్లాకు చెందిన నరేశ్(28)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమపేరుతో బాలికను పలుమార్లు లోబర్చుకున్నట్లు విచారణలో తేలడంతో పైవిధంగా శిక్ష విధించారు.
Similar News
News September 8, 2024
పార్వతీపురం మన్యం జిల్లాలో రేపు సెలవు
వర్షాల కారణంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ కేంద్ర హెచ్చరికల మేరకు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అన్నారు. ఈ అంశాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు గమనించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News September 8, 2024
విజయనగరం జిల్లాలో రేపు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సోమవారం కలెక్టరేట్‌లో జరగవలిసిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News September 8, 2024
విజయనగరం జిల్లా వాసులకు అలర్ట్
విజయనగరం జిల్లాలో ఆదివారం ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.