News February 27, 2026
పోక్సో కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష: ఎస్పీ

జీకేవీధి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్యకు పాల్పడిన నిందితుడు పాంగి రమేష్ అలియాస్ పోయి రమేష్‌కు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గురువారం ఎస్పీ అమిత్ బర్దార్ వివరాలను వెల్లడించారు. నిందితుడికి శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన జీకేవీధి పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News April 16, 2026
గద్వాల్ జిల్లాలో తగ్గేదేలే అంటున్న ఎండలు

గద్వాల్ జిల్లాలో ఎండలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ వెదర్‌మ్యాన్ రిపోర్ట్ ప్రకారం.. గద్వాల్ జిల్లాలో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 43.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు, పానీయాలు తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.
News April 16, 2026
GNT: అమరావతి ఓఆర్ఆర్ పనులకు లైన్ క్లియర్!

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ఆపేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. కృష్ణా జిల్లా రైతు వేసిన పిల్ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని సీజే ధర్మాసనం ఆక్షేపించింది. ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను ఓ వ్యక్తి ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. పనులు కొనసాగించేందుకు NHAIకి అనుమతినిస్తూ, తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
News April 16, 2026
తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోలుస్తావా?.. హరీశ్‌రావు ఫైర్

పార్లమెంట్‌లో TG ఏర్పాటుపై BJP MP తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోలుస్తావా?, దశాబ్దాల పోరాటం, ఎంతో మంది త్యాగాల ఫలితమైన అలాంటి మహోద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమే.. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన తేజస్వీ క్షమాపణలు చెప్పాలి’ అని ట్వీట్ చేశారు.


