News February 11, 2025
పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష: SP

పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి రూ.3 వేల జరిమానా, ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను జిల్లా కోర్టు ఖరారు చేసిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. పెద్ద పతివాడకు చెందిన హరీష్ ఐదేళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని.. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష పడిందన్నారు.
Similar News
News March 24, 2025
VZM: స్వర్ణంతో సత్తా చాటిన లలిత

ఢీల్లీ వేదికగా జరగుతున్న రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన కిల్లక లలిత సత్తా చాటింది. ఆదివారం జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించింది. ఇప్పటికే ఆమె శనివారం జరిగిన 400 మీటర్ల పరుగలో రజతం కైవసం చేసుకుందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. పరుగులో రాణిస్తున్న లలితను పలువురు అభినందించారు.
News March 23, 2025
విజయనగరం పోలీసుల సేవలకు గుర్తింపు

రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఉగాది పురస్కారాలకు విజయనగరం పోలీస్ శాఖలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది ఎంపికయ్యారు. స్థానిక ఎస్బి ఎస్ఐ వై.సత్యనారాయణ, ఎస్సీ, ఎస్టీ సెల్ ASI ప్రసాదరావు, ఆర్మడ్ రిజర్వ్ ఏఆర్ SI అప్పలరాజు, AR హెడ్ కానిస్టేబుల్ గోవిందం, AR కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఉగాది పురస్కారాలకు ఎంపికైనట్లు ఎస్పీ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
News March 23, 2025
ఈ నెల 31 వరకు గడువు: VZM కలెక్టర్

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ కార్యక్రమం యువతకు సువర్ణ అవకాశమని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉందని కలెక్టర్ వెల్లడించారు. పది, ఇంటర్, డిగ్రీ తరగతులు, ఐటిఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు ఇంటర్న్ షిప్ పొందవచ్చాన్నారు.