News March 29, 2025
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు: VZM SP

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్‌లో 2021లో నమోదైన పోక్సో కేసులో విజయనగరం పట్టణం గోకపేటకు చెందిన నిందితుడు కంది సన్యాసిరావు(19)కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కే.నాగమణి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు శుక్రవారం తెలిపారు. రూ.10,500 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో బాగా పనిచేసిన అధికారులను ఎస్పీ అభినందించారు.
Similar News
News February 25, 2026
సీఎం పర్యటనలో అలసత్వం వద్దు: హోంమంత్రి అనిత

పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమానికి CM చంద్రబాబు ఈనెల 28న రావివలస రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు రేపటి సాయంత్రానికల్లా పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి VC ద్వారా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, తదితరులతో సమీక్షించారు. పారిశుధ్యం, భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు పక్కాగా చేయాలని, విధుల్లో అలసత్వం వహించవద్దని సూచించారు.
News February 25, 2026
VZM: ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 952 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 21,048 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 20,096 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్‌స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 952 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.
News February 25, 2026
VZM: ఘనంగా పారా బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలు

పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 7వ రాష్ట్ర స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు బుధవారం స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా రోటరీ మాజీ గవర్నర్ డాక్టర్. ఎం.వెంకటేశ్వరరావు హాజరై ప్రారంభించారు. వైకల్యం శరీరానికే తప్పా సంకల్పానికి కాదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


