News October 28, 2024

పోక్సో కేసులో నిందితుడు అరెస్టు: SP

image

గంట్యాడ మండలంలో మూడున్నర సంవత్సరాల మైనరు బాలికపై జరిగిన లైంగిక దాడిలో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బాలికపై లైంగిక దాడి జరిగినట్లుగా సమాచారం అందిన వెంటనే విజయనగరం మహిళా PS లో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడు రవిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News November 28, 2025

పొక్సో కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు: VZM SP

image

విజయనగరానికి చెందిన వి.రవి (49)పై 2025లో నమోదైన పోక్సో కేసులో 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ తెలిపారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి కోర్టులో ఆధారాలు సమర్పించడంతో శిక్ష పడిందన్నారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం మంజూరు చేసినట్లు స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.

News November 28, 2025

సదరం రీ-అసెస్‌మెంట్ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

image

విజయనగరం జిల్లాలో NTR భరోసా పింఛన్ రీ-అసెస్‌మెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సదరం రీ-అసెస్‌మెంట్ కార్యక్రమంపై ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రీ-అసెస్‌మెంట్‌లో జాప్యం జరుగుతుండటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News November 27, 2025

గంజాయి కేసులో ఐదుగురికి జైలు శిక్ష: VZM SP

image

డ్రగ్స్ కేసులో ఐదుగురు నిందితులకు 18 నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి మీనాదేవి గురువారం తీర్పు వెలువరించారని విజయనగరం ఎస్పీ దామోదర్ తెలిపారు. విజయనగరంలోని వన్ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో జూలై 26, 2024న పాత రైల్వే క్వార్టర్స్ వద్ద 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను సమర్పించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.