News March 5, 2025

పోక్సో కేసులో నిందితుడు అరెస్టు: రాంబిల్లి సీఐ

image

రాంబిల్లి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు లాలం రామదాసును అరెస్టు చేసినట్లు రాంబిల్లి సీఐ సిహెచ్ నర్సింగరావు తెలిపారు. ఈ ఘటనపై ఈనెల2న పోక్సో కేసు నమోదు చేసామన్నారు. పరవాడ డి.ఎస్.పి విశ్వ స్వరూప్ ఆధ్వర్యంలో నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

Similar News

News December 13, 2025

రేపే రెండో విడత.. ఉ.7 గంటలకు పోలింగ్ స్టార్ట్

image

TG: రాష్ట్రంలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. తర్వాత 2 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. సెకండ్ ఫేజ్‌లో 4,332 సర్పంచ్ స్థానాలకు గాను 415 స్థానాలు, 38,322 వార్డులకు 8,300 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అధికారులు అందజేశారు.

News December 13, 2025

నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జోహార్ నవోదయ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఆరో తరగతి ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహించారు. జిల్లాలో మొత్తం 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,469 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, 4,548 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వివరించారు.

News December 13, 2025

ఫేక్ డొనేషన్లతో క్లెయిమ్స్.. వారికి IT శాఖ హెచ్చరికలు

image

డొనేషన్ల పేరుతో బోగస్ క్లెయిమ్స్ చేసుకుంటున్న వారిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) దృష్టిపెట్టింది. చర్యలు తీసుకునే ముందు పన్ను చెల్లింపుదారులకు హెచ్చరికలు జారీ చేస్తోంది. స్వచ్ఛందంగా తమ ఆదాయపన్ను రిటర్నులను విత్ డ్రా చేసుకోవాలని, ITRలను అప్డేట్ చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు SMSలు, ఈమెయిల్స్ ద్వారా సమాచారమిస్తోంది. ఇప్పటికే చాలా మంది తమ రిటర్నులను రివైజ్ చేసినట్లు చెబుతోంది.