News March 5, 2025
పోక్సో కేసులో నిందితుడు అరెస్టు: రాంబిల్లి సీఐ

రాంబిల్లి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు లాలం రామదాసును అరెస్టు చేసినట్లు రాంబిల్లి సీఐ సిహెచ్ నర్సింగరావు తెలిపారు. ఈ ఘటనపై ఈనెల2న పోక్సో కేసు నమోదు చేసామన్నారు. పరవాడ డి.ఎస్.పి విశ్వ స్వరూప్ ఆధ్వర్యంలో నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Similar News
News April 19, 2026
సాగర్‌కు పూర్వవైభవం.. పూడిక తీతకు గ్రీన్ సిగ్నల్

నాగార్జునసాగర్ జలాశయంలో పేరుకుపోయిన పూడిక తొలగింపునకు అడుగులు పడ్డాయి. సుమారు 115 టీఎంసీల మేర పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు రూ.44,000 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్ర జలవనరుల శాఖ నుంచి పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా జలాశయ నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు సాగునీటి సరఫరా మరింత మెరుగుపడనుంది.
News April 19, 2026
వేసవి తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదివారం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు. వడదెబ్బ నివారణకు కాటన్ దుస్తులు ధరించాలని, దాహం లేకపోయినా తరచుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ వంటి ద్రవాలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదన్నారు.
News April 19, 2026
రైతులకు ‘ఫార్మర్ ఐడీ’ తప్పనిసరి: కలెక్టర్ అంకిత్

భద్రాద్రి జిల్లాలోని ప్రతి రైతు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఆదివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పీఎం కిసాన్, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలు అందాలంటే 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడీ) ఉండాలన్నారు. రైతులు వెంటనే ఏఈవోలను లేదా మీసేవ కేంద్రాలను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.


