News August 3, 2024

పోక్సో కేసులో.. ముగ్గురు అరెస్ట్: ప్రకాశం ఎస్పీ

image

చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఓ మైనర్ బాలికను మాయమాటలు చెప్పి ముగ్గురు వ్యక్తులు మోసం చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతంగా సాగించారన్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Similar News

News September 13, 2024

లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

image

ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులు డిస్పోజల్ అయ్యేలా కృషి చెయ్యాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్ల పరిధిలోని కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, భూతగాదాలు, మోటార్ బైక్ యాక్సిడెంట్, చిట్ ఫండ్ వంటి కేసులు, ఇతర కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని గురువారం సూచించారు.

News September 12, 2024

ప్రకాశం: వరద బాధితులకు రూ.1 కోటీ 55 లక్షల విరాళం

image

ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండల పరిధిలోని గోణసపూడి గ్రామవాసి, పారిశ్రామికవేత్త విక్రం నారాయణ కుటుంబం వరద బాధితులకు అండగా నిలిచింది. ఈ మేరకు గురువారం CM చంద్రబాబు నాయుడిని కలిసి రూ.1,55,55,555 భారీ చెక్కును విక్రం నారాయణ అందజేశారు. ఆపద సమయాల్లో వరద బాధితులకు అండగా నిలిచిన విక్రం నారాయణ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. మంత్రి అనగాని, ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

News September 12, 2024

షర్మిలను కలిసిన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు

image

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, సంతనూతలపాడు ఇన్‌ఛార్జ్ పాలపర్తి విజేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌పై చర్చించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు షర్మిల సూచించారు.