News June 14, 2024
పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.55వేల ఫైన్ విధిస్తూ ఖమ్మం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఉమాదేవి గురువారం తీర్పు నిచ్చారు. రఘునాథపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కాంపాటి కార్తీక్(20) గతేడాది మార్చి 5న ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాలు పరిశీలించిన అనంతరం జడ్జి తీర్పు నిచ్చారు.
Similar News
News November 27, 2025
ఖమ్మం: 50 వేల మంది మహిళలకు ‘ఉల్లాస్’ వెలుగులు

15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన మహిళలకు సంపూర్ణ అక్షరాస్యత కల్పించేందుకు కేంద్రం ‘ఉల్లాస్’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలోని డ్వాక్రా మహిళల్లో 50 వేల మందికి పైగా అక్షరాస్యులు కానీ వారిని గుర్తించారు. వీరికి చదవడం, రాయడంతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పడానికి ప్రతి 10 మందికి ఒక వలంటీర్ను నియమించి, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీల్లో శిక్షణ ఇస్తున్నారు.
News November 27, 2025
ఖమ్మం: నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. మొదటి దశలో ఏడు మండలాల్లోని 192 గ్రామ పంచాయతీలకు నేటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కొణిజర్ల, వైరా, మధిర, రఘునాథపాలెం, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News November 27, 2025
రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ.. ఖమ్మంలో కూల్చివేతలు

ఖమ్మం నగరంలో ప్రధాన రవాణా కేంద్రమైన రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. పాత మున్సిపాలిటీ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రహదారిని వెడల్పు చేసే క్రమంలో బుధవారం షాపింగ్ కాంప్లెక్స్లను తొలగించి, పక్కనే డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు జేసీబీలతో ముమ్మరం చేశారు.


