News February 9, 2025

పోక్సో కేసులో విశాఖ సెంట్రల్ జైలుకు టీచర్‌: ఎస్ఐ

image

ఇటీవల వడ్డాదిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్‌పై <<15378554>>పోక్సో కేసు <<>>నమోదు చేసినట్లు బుచ్చయ్యపేట ఎస్ఐ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. చోడవరం కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై హోం మంత్రి అనిత, ప్రజాసంఘాలు స్పందించిన విషయం తెలిసిందే.

Similar News

News February 11, 2025

విశాఖ: ఆన్‌లైన్ లోన్‌యాప్స్ ముఠా అరెస్ట్  

image

ఆన్ లైన్ లోన్ యాప్స్‌తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సోమవారం అరెస్ట్ చేశారు. విశాఖలో ఓ సూసైడ్ కేసు విచారణలో భాగంగా లోన్ యాప్‌లో అప్పు తీసుకుని సమయానికి కట్టకపోవడంతో ఫొటోలు మార్ఫింగ్ చేసి వారు వేధించడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు. ఈ విషయంపై విశాఖ పోలీసులు నిందితుడుని కర్నూలులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

News February 11, 2025

విశాఖలో దివ్యాంగ పిల్లల్ని గుర్తించేందుకు సర్వే

image

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో ఇంటింటికి వెళ్లి దివ్యాంగ పిల్లల్ని గుర్తించే కార్యక్రమం సోమవారం దండు బజార్ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి వెంకటశేషమ్మ పాల్గొన్నారు. ఈనెల 24వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అంగ వైకల్యం ఉన్న పిల్లలకు వైద్యం అందిస్తే చిన్నతనంలోనే మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.

News February 10, 2025

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ బ్యాటరీ-2లో లిడ్ ఓపెన్ నుంచి మంటలు వ్యాపించడంతో నాగ శ్రీనివాసరావు అనే కార్మికుడు గాయాల పాలయ్యాడు. తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!