News January 28, 2025
పోక్సో కేసుల్లో త్వరగతిన ఇన్వెస్టిగేషన్ చేయాలి: ASF SP

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసుల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పూర్తి పారదర్శకంగా చేయాలన్నారు. పోక్సో, గ్రేవ్ కేసులు త్వరగతిన పూర్తి చేయాలన్నారు.
Similar News
News November 21, 2025
వేములవాడ: సాధారణ కుటుంబం నుంచి ఐపీఎస్..!

వేములవాడ <<18349816>>ఏఎస్పీగా<<>> నియమితులైన కొట్టే రిత్విక్ సాయి సామాన్య కుటుంబం నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగారు. వరంగల్కు చెందిన ఈయన.. శ్రీనివాస గురుకుల్ పాఠశాలలో టెన్త్ వరకు, HYDలో ఇంటర్, ఢిల్లీ శివనాడార్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్లో బీటెక్ చేశారు. 2023వ బ్యాచ్లో TG క్యాడర్ IPS అధికారిగా ఎంపికయ్యారు. తండ్రి రాధాకృష్ణారావు లైబ్రేరియన్, తల్లి గృహిణి, సోదరి వైద్యురాలిగా పనిచేస్తారు.
News November 21, 2025
హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.
News November 21, 2025
RRB-NTPC ఫలితాలు విడుదల

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.


