News February 4, 2025

పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: KMR ఎస్పీ

image

విద్యాబోధన ఒకటే కాదని, పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉందని ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో ఆమె పాల్గొన్నారు. పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లల పట్ల లైంగిక దాడులు జరుగకుండా ప్రొటెక్షన్ అధికారి పర్యవేక్షించాలన్నారు. లైంగిక వేధింపులకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News January 4, 2026

MNCL: వాకింగ్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

image

వాకింగ్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన మంచిర్యాలలో జరిగింది. గద్దెరాగడికి చెందిన నాగేందర్ శర్మ శనివారం సాయంత్రం ఏసీసీ వైపు వాకింగ్‌కు వెళ్తుండగా లడ్డా రైస్ మిల్లు వద్ద ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై మజ్హరుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 4, 2026

విశాఖ: జలాంతర్గామిని సందర్శించిన తెలంగాణ గవర్నర్

image

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విశాఖపట్నంలో తూర్పు నావిక దళానికి చెందిన అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామిని ఆదివారం సందర్శించారు. నౌకా దళంలో కీలకంగా ఉన్న INS హిమగిరితోపాటు స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన కల్వరి క్లాస్ జలాంతర్గామి INS ఖండేరీని పరిశీలించారు. దేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా సాధిస్తున్న పురోగతికి ఈ నౌకలు ప్రతీకలని గవర్నర్ ప్రశంసించారు.

News January 4, 2026

నిజామాబాద్: 102 కేసులు నమోదు

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో డ్రంకన్ డ్రైవ్ కేసులు 102 నమోదైనట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. రూ.9.50 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపద్దని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు.