News December 13, 2024
పోక్సో నేరస్థుడికి జీవిత ఖైదు: ఎస్పీ

దెందులూరుకు చెందిన ఆంథోనీ రాజ్ (51)కు జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జ్ సునంద శుక్రవారం తీర్పునిచ్చారని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 2022 అక్టోబరు 8 న గ్రామానికి చెందిన ఓ బాలికపై సదరు నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు నేరం రుజు కావడంతో జీవిత ఖైదు తో పాటు రూ.5000 జరిమానా విధిస్తూ జడ్జ్ తీర్పునిచ్చారన్నారు.
Similar News
News October 15, 2025
భీమవరం: జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

భీమవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం బీచ్ రిసార్ట్స్కు మౌలిక వసతులు కల్పించే అంశంపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పర్యాటకం విస్తృతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. దీనిలో భాగంగా, సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్న రిసార్ట్స్కు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని అవసరం ఉందన్నారు.
News October 15, 2025
కర్నూలు జీఎస్టీ విజయోత్సవ సభకు జిల్లా నుంచి 400 మంది

కర్నూలులో ఈనెల 16న నిర్వహించనున్న ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ విజయోత్సవ సభకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 400 మంది ట్రేడర్లు, పన్ను చెల్లింపుదారులు (టాక్స్ పేయర్స్) హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న ఈ సభకు ట్రేడర్స్ను తరలించడానికి భీమవరం నుండి రెండు బస్సులు, పాలకొల్లు, తాడేపల్లిగూడెంల నుంచి ఒక్కో బస్సును ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు.
News October 15, 2025
గుంతకల్లులో గంజాయి తరలిస్తూ పాలకొల్లు వాసి అరెస్ట్

అనంతపురం జిల్లా గుంతకల్లు హనుమాన్ సర్కిల్ వద్ద మంగళవారం ఎక్సైజ్ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 4kg గంజాయి, రవాణా కోసం ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మోహన్ సుందర్ ప.గో జిల్లా పాలకొల్లు మండలం వెంకటాపురం గ్రామ వ్యక్తి కాగా, ఆయన గుత్తి మండలంలో పూజారిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.