News February 26, 2025
పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు అందించిన ఎస్పీ

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసి వారికి అందజేశామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. గత 2 నెలల వ్యవధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 170 మంది భాదితులకు ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అప్పగించడం జరిగిందన్నారు. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వెంటనే CEIR పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 26, 2025
చిత్తూరు: సహాయక చర్యలకు రూ. 2 కోట్ల కేటాయింపు

భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున కేటాయించింది. ఈ నిధుల్ని వరద ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ఆహారంతో పాటు మంచి నీళ్లు అందించేందుకు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేసేందుకు. రోడ్లతో పాటు అవసరమైన వసతుల పునరుద్ధరించేందుకు ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.
News October 26, 2025
NPA, స్త్రీ నిధిపై ADB కలెక్టర్ రాజర్షి షా సమీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్లో APM, DPMలతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాంకు లింకేజి, NPAల తగ్గింపు, ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, స్త్రీ నిధి పురోగతిపై ప్రధానంగా చర్చించారు. కౌమార సభ్యుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్ పాల్గొన్నారు.
News October 26, 2025
కామారెడ్డిలో మటన్, చికెన్ ధరలు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం మటన్, చికెన్ ధరలు గత వారం మాదిరిగానే స్థిరంగా ఉన్నాయి. కిలో మటన్ రూ.800 కాగా, కిలో చికెన్ రూ.250గా ఉంది. లైవ్ కోడి కిలో రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు.


