News March 22, 2025
పోచంపల్లిలో అందాల భామల ర్యాంప్ వాక్

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే 15న యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లికి రానున్నారు. చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడి చేనేత చీరలు కట్టుకొని ర్యాంప్ వాక్ చేయనున్నారు. అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని అక్కడే ఒక డాక్యుమెంటరీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు వేదికైన పోచంపల్లి అందాల భామల రాకతో అంతర్జాతీయంగా ఖ్యాతి పొందనుంది.
Similar News
News October 16, 2025
ఈనెల 25నాటికి ఈ-పంట నమోదు పూర్తి చేయాలి: జేసీ

బాణాసంచా తయారీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించాలని అనకాపల్లి జిల్లా జేసీ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో జేసీ మాట్లాడారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా లోపాలను గుర్తించాలన్నారు. ఓటర్ లిస్టులకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి చేసి మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
News October 16, 2025
గద్వాల్: ‘అక్రమంగా మట్టి తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు’

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో మట్టి దందా ఆగడం లేదు. పట్టపగలే అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కొందరు ట్రాక్టర్ను ఆపి డ్రైవర్ను అడగగా రాజకీయ పార్టీ నాయకుల పేర్లు చెప్పాడు. రాజకీయ నాయకుల అండతో అక్రమ దందా జోరుగా సాగుతోంది. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News October 16, 2025
రాత్రిళ్లు పసుపు కలిపిన పాలు తాగుతున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచేందుకు పసుపు కలిపిన పాలు తాగడం మేలని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలను నెలరోజుల పాటు రాత్రిళ్లు తీసుకుంటే ఆరోగ్యకరమని అంటున్నారు. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిరోధిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలు, కీళ్లను బలపరచడమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా రాత్రి పూట ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది.