News January 24, 2025
పోచంపల్లిలో కేంద్ర చేనేత మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ పర్యటన

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం కేంద్ర చేనేత మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ అశోక్ కుమార్ జైస్వాల్ పర్యటించారు. ఈ సందర్భంగా చేనేత పరిశ్రమలు, చేనేత షాపులను పరిశీలించారు. చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలను అందజేస్తుందని తెలిపారు.
Similar News
News February 19, 2025
గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని సూచించారు. బ్లూ కోర్టు, పెట్రో కార్ సిబ్బంది, 100 డైల్స్ కి తక్షణమే స్పందించాలని కోరారు. ఆయన వెంట సిఐ శ్రీనివాస్, ఎస్ఎస్ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు.
News February 19, 2025
కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

AP: మద్దతు ధర లేక ఇబ్బందిపడుతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు CM చంద్రబాబు లేఖ రాశారు. రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాగు వ్యవసాయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని సూచించారు. 50శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టం భరించాలని లేఖలో విన్నవించారు.
News February 19, 2025
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని విజయనగరంలో ఆందోళన

ఈనెల 23న జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని విజయనగరంలో అభ్యర్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. రోస్టర్ విధానంపై కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో తీర్పు వెలువడిన తర్వాతే పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. తక్షణమే పరీక్ష నిర్వహిస్తే అభ్యర్థులు నష్టపోతారన్నారు. కేసులన్నీ పరిష్కరించి ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కోట జంక్షన్ వరకు ర్యాలీ చేశారు.