News January 23, 2025

పోచంపల్లి: డివైడర్‌ను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు

image

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామానికి చెందిన వరాల రవి కుటుంబం కారులో వెళుతుండగా పోచంపల్లి వద్ద డివైడర్‌కు ఢీకొన్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న108 వాహన సిబ్బంది గాయాలపాలైన నలుగురిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News February 11, 2025

హుస్నాబాద్: నేషనల్ హైవే పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

image

నేషనల్ హైవే రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి నేషనల్ హైవే అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో నేషనల్ హైవే ఇంజినీర్, కాంట్రాక్టర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టౌన్ లో వాటర్ పైప్ లైన్, సెంట్రల్ లైటింగ్ త్వరగా పూర్తి చేయాలన్నారు. పందిళ్ళ టోల్ గేట్ నిర్మాణానికి భూసేకరణ చేయాలని ఆదేశించారు.

News February 10, 2025

కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు.. అప్డేట్

image

కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు మొత్తం గ్రాడ్యుయేట్ నామినేషన్లు- 100, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు- 17 దాఖలయ్యాయని ఎన్నికల అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి వెల్లడించారు. ఇందులో నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి దాఖలైన నామినేషన్లు- 51, టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్లు- 8 వచ్చాయని తెలిపారు. కాగా.. నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది.

News February 10, 2025

చిగురుమామిడి: బైక్‌కు అడ్డొచిన కోతి.. ఇద్దరికి గాయాలు

image

కోతి అడ్డు రావడంతో ద్విచక్రవాహనంపై నుంచి కింద పడిన ఓ మహిళ కాలు విరిగింది. చిగురుమామిడి గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయ సమీపంలో, కేశవపూర్‌కు చెందిన పద్మ, భర్తతో కలిసి సోమవారం బైక్‌పై వెళ్తున్నారు. వాహనానికి వానరం అడ్డురావడంతో బ్రేక్ వేయగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో పద్మ కాలు విరిగి తీవ్రంగా గాయపడగా.. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, క్షతగాత్రులను 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

error: Content is protected !!