News April 10, 2025

పోచంపల్లి: నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్ 

image

భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానంద గ్రామీణ తీర్థ సంస్థలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్ రిపేరింగ్, సీసీటీవీ ఇన్‌స్టాలేషన్ – మెయింటెనెన్స్ , హౌస్ వైరింగ్, జర్దోజి(అడ్వాన్సుడ్) శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ లక్ష్మి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Similar News

News November 25, 2025

బలవంతపు వాంతులతో క్యాన్సర్‌: వైద్యులు

image

బ్రష్ చేశాక చాలా మంది గొంతులోకి వేళ్లు పెట్టి బలవంతంగా వాంతులు చేసుకుంటారు. అలా పదే పదే చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కడుపులోని యాసిడ్ పదేపదే పైకి తన్నడం వల్ల అన్నవాహికలోని ‘టైల్స్’ లాంటి సున్నితమైన కణాలు అరిగిపోతాయి. ఇలా మాటిమాటికీ జరిగితే తీవ్రమైన సందర్భాల్లో క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. నాలుకను గీసుకొని ముఖం కడుక్కుంటే చాలు’ అని సూచించారు.

News November 25, 2025

5న తిరుమల దర్శనం టికెట్ల విడుదల

image

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి TTD కీలక ప్రకటన వెలువరించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15000 చొప్పున రూ.300 టికెట్లు ఇస్తామని తెలిపింది. డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. ఆరోజు టీటీడీ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది.

News November 25, 2025

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

image

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 24 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మరోవైపు మలక్కా జలసంధి వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని పేర్కొంది. వీటి ప్రభావంతో NOV 29 నుంచి DEC 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.