News March 3, 2025
పోచంపల్లి: మద్యం విక్రయిస్తే రూ.25 వేలు ఫైన్..

మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతుండటంతో భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. బెల్ట్ షాపులను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో బెల్ట్ షాపులు ఉండకూడదని అందరూ ప్రతిజ్ఞ చేశారు. మద్యం విక్రయిస్తే రూ. 25 వేల జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి రూ. 5 వేలు బహుమానమని ప్రకటించారు. బెల్ట్ షాపులను గ్రామస్తులు నిషేధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 25, 2025
అనకాపల్లి జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్

అనకాపల్లి జిల్లాలో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కానుంది. సోమవారం నాడు మంత్రివర్గ ఉప సంఘం నక్కపల్లిని రెవెన్యూ డివిజన్‌గా మార్పు చేస్తూ ఆమోదం తెలిపింది. త్వరలో పారిశ్రామికంగా నక్కపల్లిలో అనేక పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా మారితే డీఎస్పీ, ఆర్డీవో స్థాయి అధికారుల కార్యాలయాలు కూడా ఏర్పాటు అవుతాయి. ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వెలిబుచ్చుతున్నారు.
News November 25, 2025
సికింద్రాబాద్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి త్వరగా వెళ్లాలంటే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలే శరణ్యం. ఇటీవల కాలంలో రైలులో కోచ్‌ల సంఖ్య సరిపోకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది వీటి సంఖ్యను పెంచాలని అధికారులకు వినతిపత్రాలిచ్చారు. ఈ నేపథ్యంలో కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 14 ఉన్న ఏసీ చైర్ కార్ కోచ్‌ల సంఖ్యను 16కు పెంచనున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
News November 25, 2025
టెన్త్ పరీక్ష ఫీజు గడువు నవంబర్ 30: డీఈవో

పదో తరగతి విద్యార్థులు నవంబర్ 30వ తేదీలోగా పరీక్ష రుసుం తప్పనిసరిగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేశ్ తెలిపారు. విద్యార్థుల నామినల్ రోల్స్‌ను పాఠశాల యూడైస్ వివరాలతో ధ్రువీకరించుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆయన సూచించారు. యూడైస్, ఫీజులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం 9959567275, 9490178184, 9951558185 నంబర్లను సంప్రదించాలని డీఈవో పేర్కొన్నారు.


