News July 3, 2024
పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్

‘ఎప్పుడైనా లోకల్ లోకలే. బయట నుండి వచ్చిన వాళ్లు అద్దెకు ఉండేవారు మాత్రమే’ అంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాసుల బాలరాజు మంగళవారం పోచారంను తన అనుచరులతో కలువగా పోచారం మాట్లాడుతూ.. బాలరాజుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వస్తే వాళ్లకు కడుపు నొప్పి ఎందుకు ? అంటూ కాంగ్రెస్లోని ఒక వర్గాన్ని ఉద్దేశించి అన్నారు.
Similar News
News October 2, 2025
నిజామాబాద్: సొంత ఊరికి దిల్ రాజు

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు తన సొంత గ్రామమైన నర్సింగ్ పల్లిలో దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని మిత్రులను బంధువులను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఎంత బిజీగా ఉన్నా దసరా రోజు తమ సొంత గ్రామమైన నర్సింగపల్లికి తప్పకుండా వస్తామని దిల్ రాజు అన్నారు. గ్రామాల్లోనే నిజమైన భారతదేశం ఉందన్నారు.
News October 2, 2025
NZB: దసరా పండుగ సందర్భంగా సీపీ ఆయుధ పూజ

దసరా పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆయుధ పూజా చేశారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీసీపీ బస్వా రెడ్డి, పోలీస్ అధికారులతో కలిసి ఆయుధ పూజ, వాహనాల పూజా, బీడీ టీం సామగ్రికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏకే 47తో గాల్లో 5 రౌండ్లు కాల్పులు చేశారు.
News October 1, 2025
NZB: విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సీపీ

నిజామాబాద్ జిల్లా ప్రజలకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు. ప్రజలు పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.