News March 26, 2025
పోరాటయోధుడు ధర్మభిక్షం

స్కూల్లో తన పట్టాభిషేక రజతోత్సవాలను జరపాలన్న నిజాం ఆదేశాలను ధిక్కరించి సంచలనం సృష్టించాడో విద్యార్థి. ఆయనే బొమ్మగాని ధర్మభిక్షం. NLG జిల్లా ఊకొండిలో 1922 ఫిబ్రవరి 15న లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు జన్మించాడు ధర్మభిక్షం. 1942లో CPIలో చేరి నిజాంపై సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగి, సాయుధ పోరాటాన్ని విస్తరించారు. మూడు సార్లు MLAగా, రెండు సార్లు MPగా గెలుపొందారు. నేడు ఆయన వర్ధంతి
Similar News
News April 22, 2025
ప్రకాశం: వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

ప్రకాశం జిల్లాలో వేర్వేరు ఘటనల్లో సోమవారం ముగ్గురు మృతి చెందారు. పామూరులో బాల భవేశ్ తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కాపురంలోని కాశీ రావు మానసిక స్థితి సరిగా లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు గ్రామానికి చెందిన అరవింద్ చెన్నైలో చదువుకుంటూ నీటిలో మునిగి మృతి చెందాడు.
News April 22, 2025
నేటి నుంచి విశాఖ రైల్వే స్టేడియంలో సమ్మర్ క్యాంప్

ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేడియంలో ఏప్రిల్ 22 నుంచి మే 31 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు డీఆర్ఎం లలిత్ బోహ్రా సోమవారం తెలిపారు. 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రతిరోజూ ఉదయం 12రకాల క్రీడలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో విశాఖలో నివసించే వారు అర్హులని అన్నారు. పూర్తి వివరాలకు రైల్వే స్టేడియంలో సంప్రదించాలన్నారు.
News April 22, 2025
పీఎం అవార్డు అందుకున్న అప్పటి ఏలూరు కలెక్టర్

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పీఎం అవార్డు (2023)ను APSWREIS సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ ప్రధాని మోదీ సమక్షంలో ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో సోమవారం అందుకున్నారు. 17వ సివిల్ సర్వీస్ డే సందర్భంగా పరిపాలనలో ఉత్తమ పనితీరు చూపిన 10 మంది ఐఏఎస్ అధికారులకు ఈ అవార్డును కేంద్రం బహుకరించింది. ఈ 10 మందిలో ఒకరైన ప్రసన్న వెంకటేష్ జనవరి 2022 నుంచి జూలై 2024 వరకు ఏలూరు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.