News January 11, 2025

పోరాట వీరుడు!

image

నేడు వడ్డే ఓబన్న జయంతి. ఈయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నమ్మిన బంటు. ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఉద్యమాలకు ఊపిరిపోశారు. ఓబన్న సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు 1807 జనవరి 11న జన్మించారు. నరసింహారెడ్డి తాతది ఇదే గ్రామం కావడంతో ఇరు కుటుంబాలకూ సంబంధాలు ఉండేవి. 1846 అక్టోబరు 6న బ్రిటిష్‌ వారితో పోరాటంలో ఓబన్న 39ఏళ్లకే వీరమరణం పొందారు. ఆ తర్వాత నరసింహారెడ్డిని ఉరితీశారు.

Similar News

News November 20, 2025

పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సహకంపై దృష్టి పెట్టండి: కలెక్టర్

image

జిల్లాలో పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహంపై దృష్టి సాధించాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నిర్వహించారు. పరిశ్రమల విస్తరణ, ఎగుమతుల పెంపు, స్థానిక ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించే చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఎగుమతుల అవకాశాలు గుర్తించి సమస్యను పరిష్కరించాలని సూచించారు.

News November 20, 2025

కర్నూలు జిల్లాలో 8,051 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే ఒక నెల జైలు శిక్షతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 17వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో 8,051 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News November 19, 2025

అన్నదాతకు ప్రభుత్వం అండ: కలెక్టర్

image

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ 2025-26 2వ విడత కింద జిల్లాలో 2,72,757 మంది రైతులకు రూ.181.51 కోట్లు జమయ్యాయని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. కోడుమూరు ఆర్.కొంతలపాడులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఉల్లి, మిర్చి, పత్తి పంటల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 11 పత్తి మిల్లులు పనిచేస్తున్నాయన్నారు.