News September 12, 2024
పోరుమామిళ్ల పోలీస్ స్టేషను తనిఖీ చేసిన డీఐజీ
పోరుమామిళ్ల పోలీస్ స్టేషను కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్లోని రికార్డులను ఆయన తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలోని క్రైమ్ రిపోర్ట్ గురించి సీఐని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పోలీసులకు ఆయన పలు సూచనలు చేశారు.
Similar News
News October 16, 2024
సజావుగా ఇసుక పంపిణీ చేయాలి: కడప కలెక్టర్
ప్రజలకు సజావుగా ఇసుక పంపిణీ చేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని కడప జిల్లా కలెక్టర్ శంకర్ లోతేటి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలో ఇసుక పంపిణీపై సంబంధిత అధికారులతో, ఇసుక ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అందరికీ అందుబాటులో ఇసుకను అందించాలని ప్రభుత్వానికి, జిల్లాకు ప్రతిష్ఠలు తీసుకురావాలని చెప్పారు.
News October 16, 2024
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం
కడప నగరంలో నవంబర్ 16 నుంచి 20 వరకు జరగనున్న కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడుని దర్గా పెద్దలు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను మంగళవారం కలిసి దర్గా ముతావల్లి ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేనీ ఆహ్వాన పత్రిక అందించారు. సీఎం సానుకూలంగా స్పందించారని మత పెద్దలు తెలిపారు.
News October 15, 2024
కమలాపురం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
సామాజిక తనిఖీలో భాగంగా కమలాపురం పోలీస్ స్టేషన్‌ను మంగళవారం కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లాంటి అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మొపుతాం మోపుతామన్నారు. కష్టాల్లో వచ్చిన ప్రజలకు పోలీసులు అండగా నిలవాలిని ఫ్రెండ్లీ పోలీసింగ్ లాంటి అంశాలపై సిబ్బందికి తగు సూచనలు ఇచ్చిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.