News March 10, 2025
పోర్టు పనుల్లో కందుకూరు MLA దందా..?

కందుకూరు టీడీపీ MLA ఇంటూరి నాగేశ్వర రావుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ‘రామాయపట్నం పోర్టు పనుల్లో వాటా కావాలని MLA కోరగా కాంట్రాక్టర్ ఇవ్వలేదు. పోర్టు పనులకు కంకర, ఇసుక తీసుకెళ్లే ప్రతి లారీకి వెయ్యి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్లతో ఆ వాహనాలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఈ వ్యవహారం సీఎం ఆఫీసుకు చేరినా ఎమ్మెల్యే దందా ఆపడం లేదు’ అంటూ ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.
Similar News
News October 23, 2025
ప్రకాశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు తక్షణమే స్పందించడానికి జిల్లా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటం జరిగిందని, అవి 24×7 అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్ద పికెట్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.
News October 23, 2025
ఒంగోలు: 16 మందికి కారుణ్య నియామకాలు

ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. బుధవారం ఆయన జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి ప్రకాశం భవనంలోని తన ఛాంబరులో 16 మందికి కారుణ్య కోటాలో నియామక పత్రాలను అందించారు. విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ వారిని అభినందించారు.
News October 22, 2025
ప్రకాశం జిల్లాకు NDRF బృందాలు: హోం మంత్రి

ప్రకాశం జిల్లాకు మరో రెండు రోజులపాటు భారీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగానికి హోం మంత్రి అనిత బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు NDRF బృందాలను పంపించేలా ఆమె ఆదేశించారు. దీంతో ప్రకాశం జిల్లాపై ఎలాంటి తుఫాన్ ప్రభావం ఉన్నా ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు, కలెక్టర్ రాజాబాబు సారథ్యంలో సిద్ధమయ్యారు.