News March 10, 2025

పోర్టు పనుల్లో కందుకూరు MLA దందా..?

image

కందుకూరు టీడీపీ MLA ఇంటూరి నాగేశ్వర రావుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ‘రామాయపట్నం పోర్టు పనుల్లో వాటా కావాలని MLA కోరగా కాంట్రాక్టర్ ఇవ్వలేదు. పోర్టు పనులకు కంకర, ఇసుక తీసుకెళ్లే ప్రతి లారీకి వెయ్యి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్లతో ఆ వాహనాలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఈ వ్యవహారం సీఎం ఆఫీసుకు చేరినా ఎమ్మెల్యే దందా ఆపడం లేదు’ అంటూ ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.

Similar News

News March 16, 2025

ఒంగోలు రిమ్స్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా నిన్న రాత్రి 11.30 గంటలకు ఒంటరిగా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. క్యాజువాలిటీ వార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో సీనియర్ డాక్టర్ లేకపోవడాన్ని గుర్తించారు. సంబంధిత డాక్టర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా కలెక్టర్ ఉన్నపళంగా ఆసుపత్రికి రావడంతో సిబ్బంది షాక్ అయ్యారు. మహిళా కలెక్టర్ రాత్రివేళ చెకింగ్ చేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.

News March 16, 2025

ఒంగోలు: 10 విద్యార్థులకు ALL THE BEST.. కలెక్టర్

image

ఒంగోలులోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలను శనివారం కలెక్టర్ తమీమ్ అన్సారియా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు రాసే కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు యంత్రాంగం కల్పించినట్లు చెప్పారు. పరీక్షలు బాగా రాయాలని  ALL THE BEST చెప్పారు.

News March 15, 2025

ప్రకాశం: ఈనెల 19న మెగా జాబ్ మేళా

image

ఈనెల 19న ఒంగోలులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్‌లో శనివారం జాబ్ మేళా ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 10 నుంచి పీజీ వరకు చదివిన యువత జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.

error: Content is protected !!