News February 20, 2025
పోలవరంపై కేంద్రమంత్రికి ఎంపీ సానా సతీష్ విజ్ఞప్తి

పోలవరం ప్రాజెక్టు పనులు పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో కలిసి కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్‌లతో కలిసి సతీష్ బాబు కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్‌ను గురువారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయాన్ని కాకినాడలోని ఎంపి కార్యాలయ ప్రతినిధులు మీడియాకు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
Similar News
News November 17, 2025
మత్స్యశాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్

కామారెడ్డి నూతన జిల్లా మత్స్య శాఖ ఇంచార్జి అధికారిగా కె. డోలిసింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న శ్రీపతి వరంగల్, హన్మకొండ జిల్లాలకు వర్క్ డిప్యూటేషన్‌పై బదిలీ అయ్యారు.

బుట్టాయగూడెం: పదో తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ

బుట్టాయగూడెం జడ్పీ హైస్కూల్ ప్లస్‌ను ఏలూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్. ఆశాలత సోమవారం సందర్శించారు. రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్ర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు కూర్చునే ఏర్పాట్లు, గాలి, వెలుతురు, తాగునీటి సౌకర్యం, సీసీటీవీ అమరికలతో పాటు ఇతర ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.