News March 6, 2025
పోలవరంపై YCPకి మాట్లాడే అర్హత లేదు: షర్మిల

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ప్రచారం అవాస్తవం అయితే కేంద్రంతో ప్రకటన చేపించాలని ప్రభుత్వాన్ని YS షర్మిల డిమాండ్ చేశారు. ‘పోలవరంపై YCPకి మాట్లాడే అర్హత లేదు. ఈ ప్రాజెక్టు పేరు వింటే YSR గుర్తుకొచ్చే మీకు.. 5 ఏళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా? నాడు తట్టెడు మట్టి అయినా తీశారా? ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకుంది మీరు కాదా?’ అని ఆమె Xలో నిలదీశారు.
Similar News
News October 19, 2025
పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం

పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరి నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. పెనుగొండ ఎస్ఐ కె. గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళ మృతదేహాన్ని నదిలో గుర్తించారు. సిద్ధాంతం వీఆర్వో నాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 19, 2025
భీమవరం: రేపు పీజీఆర్ఎస్ రద్దు

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం దీపావళి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.
News October 19, 2025
పాలకొల్లు: అక్వా రైతులను ఆదుకోవాలని మంత్రికి వినతి

పాలకొల్లు పర్యటనకు విచ్చేసిన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుకు శనివారం జైభారత్ క్షీరారామ అక్వా రైతు సంఘం అధ్యక్షుడు జి. గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో అక్వా రైతులు వినతిపత్రం సమర్పించారు. ఫీడ్ ధరలు పెరగడం, రొయ్య కౌంట్ రేటు పెరగకపోవడంతో తాము నష్టపోతున్నామని మంత్రికి వివరించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రైతులు తెలిపారు.