News November 25, 2024
పోలవరంలో కనువిందు చేస్తున్న ‘అడవి నాభి పుష్పాలు’

ప్రకృతిలో అందంగా పూసే అడవి నాభి పుష్పాలు పోలవరం నిర్మాణ ప్రాంతమైన ట్విల్ టన్నెల్కు వెళ్లే దారిలో చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఈ మొక్క వేరు దీర్ఘకాలిక వ్రణాలు, కుష్ట, శరీరపు మంటలు వంటి మొదలగు వ్యాధులకు చికిత్సలో ఔషధంగా పనిచేస్తుందని, కానీ విష ప్రభావం ఉండటం వల్ల వైద్యుల సలహామేరకు తగిన మోతాదులో మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు. అలంకరణకు కూడా ఉపయోగపడే ఈ మొక్క ప్రకృతికి అందాన్ని చేకూరుస్తుంది.
Similar News
News December 4, 2025
రూ.14,00 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు: కలెక్టర్

జిల్లాలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
News December 4, 2025
పాలకోడేరు: పిల్లలను ఎత్తుకుని ముద్దాడిన కలెక్టర్

పాలకోడేరు మండలంలోని విస్సాకోడేరులో ఉన్న శిశు గృహ సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె శిశు గృహ సంరక్షణలో ఉన్న పిల్లలను ఎత్తుకుని ముద్దాడారు. కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, దత్తత ప్రక్రియ ఎంతవరకు వచ్చింది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలను శ్రద్ధగా చూడాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు సూచించారు.
News December 4, 2025
జలజీవన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

జిల్లాలో జలజీవన్ మిషన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఏర్పాటు పనులపై సంబంధిత శాఖలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులను, పురోగతిని గుత్తేదారు సంస్థ ప్రతినిధి, మేఘా కంపెనీ డీజీఎం వాసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు.


