News June 4, 2024
పోలవరంలో మళ్లీ వైసీపీ ముందంజ

పోలవరంలో వైసీపీ, జనసేన మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. మొదటి 4 రౌండ్ల వరకు వైసీపీ ఆధిక్యం ప్రదర్శించగా.. అప్పటి నుంచి 8 రౌండ్ల వరకు జనసేన దూసుకెళ్లింది. తాజాగా 9 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి 45777 ఓట్లు సాధించి 453 ఓట్ల మెజారిటీతో ముందున్నారు.
Similar News
News November 23, 2025
ఉండి: ఆవాస్ సర్వే పరిశీలనలో కలెక్టర్

ఉండి రాజులపేటలో జరుగుతున్న ‘ఆవాస్’ సర్వేను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. గృహ నిర్మాణాలకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం గృహ నిర్మాణ శాఖ చేపడుతున్న ఈ సర్వే తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. యాప్ పనితీరు, ఆన్లైన్ ప్రక్రియపై వివరాలు అడిగారు. కముజు సూర్యకుమారి అనే లబ్ధిదారుని వివరాలను యాప్ ద్వారా ఆన్లైన్ చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు.
News November 23, 2025
రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేని వారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్సైట్లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 23, 2025
భీమవరం: ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు

భీమవరంలో సత్యసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని, బాబా చిత్రపటానికి నివాళులర్పించారు. మానవసేవే మాధవసేవగా బాబా అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలను అందరూ పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


