News October 25, 2024
పోలవరంలో రూ.2 వేల కోట్లతో నౌకదళ ఆయుధగారం ప్రాజెక్ట్: MP

పోలవరం నియోజకవర్గంలో రూ.2 వేల కోట్లతో నౌకాదళ ఆయుధగారం ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ..నేవీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతుందని త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఈ ప్రాంత ప్రజలు సహకరించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
తణుకు: ‘తల్లిదండ్రులను చూడని పిల్లలు శిక్షార్హులు’

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వారి పోషణ పట్టించుకోలేని పిల్లలు శిక్షార్హులు అవుతారని తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోతర్లంక సాయిరాం అన్నారు. సోమవారం తణుకు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ఆర్డీవో అధికారుల ద్వారా న్యాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

ఆకివీడు: ఆన్లైన్ మోసం.. 39వేలు పోగొట్టుకున్న మహిళ

ఆకివీడులో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. ఇన్స్టాగ్రామ్లో “రూ. 999కే మూడు డ్రెస్సులు” అనే ఆఫర్ నమ్మిన ఓ గృహిణి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దఫదఫాలుగా రూ.39 వేలు పోగొట్టుకున్నారు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆకివీడు ఎస్ఐ హనుమంత నాగరాజుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ధర్యాప్తు చేస్తున్నారు.