News September 4, 2024
పోలవరం: గోదావరికి పెరుగుతున్న వరద
గోదావరి నీటిమట్టం మంగళవారం అనూహ్యంగా పెరిగింది. రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరింది. బుధవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుంచి 4,56,011 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. స్పిల్వే ఎగువన 29.830 మీటర్లు, దిగువన 20.340 మీటర్ల నీటి మట్టం నమోదైనట్లు ఈఈలు మల్లికార్జునరావు, వెంకటరమణ తెలిపారు.
Similar News
News November 17, 2024
ప్రభుత్వ అరాచకాలపై సంక్రాంతి తర్వాత ప్రణాళిక: మాజీ మంత్రి కారుమూరి
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో పాటు అరాచకాలపై వైసీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత ప్రత్యేక ప్రణాళిక చేయనున్నట్లు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం తణుకు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు.
News November 17, 2024
దేవరపల్లి: కార్తీకమాసంలో చికెన్ ధరలు ఇలా
ప.గో జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ పై శ్రావణమాసం ఎఫెక్ట్ పడుతోంది. అయితే జిల్లాలో పలుచోట్ల ధరలు తగ్గితే .. కొన్నిచోట్ల మాత్రం సాధారణంగానే ఉన్నాయి. కాగా దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు గ్రామంలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కేజీ ఫారం మాంసం రూ. 200గా ఉంది, బ్రాయిలర్ రూ. 220 ఉంది. అయితే కార్తీకమాసం కావడంతో వినియోగదారులు తక్కువగా ఉన్నారని వ్యాపారస్థులు చెబుతున్నారు.
News November 17, 2024
తాడేపల్లిగూడెంలో ఎయిర్ పోర్ట్
రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అందులో పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం ఒకటి. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం ఆ ప్రాంతంలో 1,123 ఎకరాలను గుర్తించింది. పారిశ్రామిక , వ్యాపార , పర్యాటకం ఇలా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.