News February 12, 2026
పోలవరం జిల్లాలో 29 PHCలకు నిధులు విడుదల

పోలవరం జిల్లాలో ఉన్న 29 PHCలకు ఒక్కో ఆసుపత్రికి రూ.2లక్షలు చొప్పున రూ.58 లక్షల నిధులను విడుదల చేసినట్లు జిల్లా వైద్యాధికారిణి డా. సరిత తెలిపారు. ఈనెల 8న నిధులు వచ్చాయన్నారు. 15 లోపు ఆసుపత్రి నిధులు ఖర్చులు ట్రెజరీకి చూపి నిధులు వినియోగించాల్సి ఉందన్నారు. వాటికి మార్గదర్శకాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 7, 2026
CEC వేలు కోసేసే వాడిని.. TMC ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం మమతా బెనర్జీతో CEC చెడుగా ప్రవర్తించారు. CM వైపు వేలు ఎత్తడానికి ధైర్యం చేశారు. CEC కాకపోయుంటే నేను అదే రోజు ఆయన వేలును కోసేసే వాడిని’ అని కోల్‌కతాలో నిరసన కార్యక్రమంలో అన్నారు. SIR విషయంలో గత నెలలో జ్ఞానేశ్ కుమార్, మమత మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
News March 7, 2026
కామారెడ్డి: జర జాగ్రత్త..!

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో భిక్కనూరు, మేనూరు, సోమూరు 38.2°C, కొల్లూరు, సదాశివనగర్ 38.1, ఎల్పుగొండ, బీర్కూర్ 38, సర్వాపూర్ 37.8, డోంగ్లి, బీబీపేట 37.7, పుల్కల్, పిట్లం 37.3, మాచాపూర్, గాంధారి, నాగిరెడ్డిపేట 37.2, దోమకొండ 37.1, కామారెడ్డి 37, బిచ్కుంద 36.7, లింగంపేట, లచ్చపేట 36.6, జుక్కల్ 36.5°C ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 7, 2026
పెద్దపల్లి: IAS కోసం పోరాటం.. ఐదో ప్రయత్నంలో సొంతం!

పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది పెద్దపల్లి జిల్లాకు చెందిన గూడెల్లి సృజన. చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలనే కల కన్న ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని సివిల్స్ బాట పట్టింది. నాలుగుసార్లు వైఫల్యం ఎదురైనా వెనకడుగు వేయలేదు. గతేడాది గ్రూప్-1లో 35వ ర్యాంక్ సాధించి ప్రస్తుతం డీఎస్పీగా శిక్షణ పొందుతూనే తన ఐదో ప్రయత్నంలో ఆలిండియా 55వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ కలను సాకారం చేసుకున్నారు.


