News February 13, 2025

పోలవరం: నేత్రాదానం చేసిన మహిళ

image

పోలవరం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుపులేటి అనిత (36) గుండెపోటుతో అకాల మరణం చెందారు. కుటుంబ సభ్యులు ఆమె మరణానంతరం రాజమండ్రి శ్రీ రాధాకృష్ణ ‘ఐ’ బ్యాంకుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న టెక్నీషన్‌లు కొత్తపేటకు చేరుకుని, మృతురాలు కంటి కార్నియాలను సేకరించారు. తాను చనిపోతూ మరొకరికి చూపునిచ్చేలా చేయడం పునర్జన్మతో సమానమని కుటుంబ సభ్యులు భాగోద్వాగానికి లోనైయ్యారు. ఆమెను పలువురు ప్రసంశించారు.

Similar News

News November 6, 2025

పిడుగురాళ్లలో వ్యక్తి దారుణ హత్య

image

పిడుగురాళ్ల లెనిన్ నగర్‌కు చెందిన కొమ్ము సంతోష్ రావును స్నేహితుడు సుభాని బండరాళ్లతో కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని సంతోష్ రావు బలవంతం చేయగా సుభాని నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరగటంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 6, 2025

HYD: మీర్జాగూడ యాక్సిడెంట్.. యువకుడి మెసేజ్ వైరల్!

image

ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఓ యువకుడు చేసిన పని అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘రూల్స్ ఎప్పుడూ ఇబ్బందిగా అనిపిస్తాయి. మన ప్రాణాలు కాపాడేవి అవే. త్వరగా వెళ్లాలంటే ముందు జాగ్రత్తగా వెళ్లాలి. మీ ఇంటికెళ్తూ వేరే ఇళ్లల్లో కన్నీళ్లు మిగిల్చకండి’ అంటూ మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ఇలా ప్లకార్డులు పట్టుకొని కనిపించాడు. మీర్జాగూడ ఘటన నేపథ్యంలో యువకుడు ఇచ్చిన మెసేజ్ వైరలవుతోంది.

News November 6, 2025

‘SIR’ను వ్యతిరేకించిన మమతకూ ఫామ్ ఇచ్చిన BLO

image

SIRకు వ్యతిరేకంగా 2 రోజుల కిందట బెంగాల్ CM మమతా బెనర్జీ <<18197344>>ర్యాలీ<<>> నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాతి రోజే ఓటర్ లిస్ట్ ఎన్యుమరేషన్ ఫామ్‌ను ఆమె అందుకున్నారు. కోల్‌కతాలోని CM నివాసానికి నిన్న బూత్ లెవల్ ఆఫీసర్ వెళ్లారు. ఫామ్‌ను నేరుగా మమతకే ఇస్తానని సెక్యూరిటీ సిబ్బందికి BLO చెప్పినట్లు సమాచారం. దీంతో స్వయంగా మమత వచ్చి తీసుకున్నారని తెలుస్తోంది. దాన్ని నింపిన తర్వాత BLOకు ఇవ్వనున్నారు.