News February 13, 2025
పోలవరం: నేత్రాదానం చేసిన మహిళ

పోలవరం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుపులేటి అనిత (36) గుండెపోటుతో అకాల మరణం చెందారు. కుటుంబ సభ్యులు ఆమె మరణానంతరం రాజమండ్రి శ్రీ రాధాకృష్ణ ‘ఐ’ బ్యాంకుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న టెక్నీషన్‌లు కొత్తపేటకు చేరుకుని, మృతురాలు కంటి కార్నియాలను సేకరించారు. తాను చనిపోతూ మరొకరికి చూపునిచ్చేలా చేయడం పునర్జన్మతో సమానమని కుటుంబ సభ్యులు భాగోద్వాగానికి లోనైయ్యారు. ఆమెను పలువురు ప్రసంశించారు.
Similar News
News March 24, 2025
ములుగు: బెట్టింగ్‌కు పాల్పడే వారి సమాచారం ఇవ్వండి: ఎస్పీ

ములుగు జిల్లాలో ఐపీఎల్ క్రీడల సందర్భంగా బెట్టింగులకు పాల్పడే వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని జిల్లా ఎస్పీ శబరీశ్ అన్నారు. జిల్లాలో బెట్టింగ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. బెట్టింగ్ యాప్లలో లక్షల్లో డబ్బు పెట్టి మోసపోయిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని ఎస్పీ సూచించారు.
News March 24, 2025
BREAKING: మంత్రి వర్గ విస్తరణకు ఓకే!

TG: ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలంగాణ నేతల భేటీ ముగిసింది. మంత్రి వర్గ విస్తరణకు పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 4 మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఉగాది రోజున ప్రకటన వెలువడే అవకాశముంది. దీంతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది.
News March 24, 2025
కంగ్రాట్స్ రాజీవ్.. మళ్లీ కత్తి దూసేందుకు సిద్ధం: శశి థరూర్

BJP కేరళ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రాజీవ్ చంద్రశేఖర్‌కు కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోసారి కత్తులు దూసేందుకు ఎదురు చూస్తున్నానని సరదాగా కామెంట్ చేశారు. వేర్వేరు పార్టీలైనప్పటికీ కొన్ని రోజులుగా వీరిద్దరూ కొన్ని అంశాలపై ఒకే రకమైన వాయిస్ వినిపిస్తున్నారు. 2024 LS ఎన్నికల్లో తిరువనంతపురంలో నువ్వానేనా అన్నట్టు జరిగిన పోటీలో రాజీవ్‌పై శశి 15వేల ఓట్ల మార్జిన్‌తో గెలుపొందారు.