News May 25, 2024
పోలవరం పునరావాస బాధితుడి ఆత్మహత్యాయత్నం

పోలవరం పునరావాస బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద దేవీపట్నానికి చెందిన ఉండమట్ల సీతారామయ్య(73) పురుగు మందు తాగాడు. పరిహారం, R&R ఇవ్వడం లేదని, ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదంటూ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 9, 2025
తూ.గో: విదేశీ ఉద్యోగాల ఎర.. రూ.4 కోట్లకు టోకరా

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి రూ. 4 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం నిడదవోలు మండలం గోపవరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యంట్రపాటి విజయలక్ష్మి, భాగ్యం తదితరులు తమను నిండా ముంచారని బాధితులు వాపోయారు. డబ్బులు తిరిగి అడిగితే ముఖం చాటేస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్, జిల్లా జడ్జికి వారు ఫిర్యాదు చేశారు.
News December 9, 2025
విదేశీ ఉద్యోగాల ఎర.. రూ.4 కోట్లకు టోకరా

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి రూ. 4 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం నిడదవోలు మండలం గోపవరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. యంట్రపాటి విజయలక్ష్మి, భాగ్యం తదితరులు తమను నిండా ముంచారని బాధితులు వాపోయారు. డబ్బులు తిరిగి అడిగితే ముఖం చాటేస్తున్నారని, తమకు న్యాయం చేయాలంటూ సోమవారం కలెక్టర్, జిల్లా జడ్జికి వారు ఫిర్యాదు చేశారు.
News December 9, 2025
రాజమండ్రి: ప్లాస్టిక్ రహిత నగరం వైపు.. ‘రీసైక్లింగ్ లీగ్’

RJYలో ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా నగరపాలక సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ‘ప్లాస్టిక్ రీసైక్లింగ్ లీగ్’ పోస్టర్ను కమిషనర్ రాహుల్ మీనా ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ముప్పుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు లీగ్ దోహదపడుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.