News September 3, 2024
పోలవరం: 5,16,058 క్యూసెక్కుల వరద నీరు విడుదల

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులు, కొండవాగుల జలాలతో గోదావరి నీటిమట్టం సోమవారం పెరిగింది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే నుంచి అదనంగా వస్తున్న 5,16,058 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే ఎగువన 30.190 మీటర్లు, స్పిల్ వే దిగువన 21.130 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు ప్రాజెక్ట్ ఈఈలు వెంకటరమణ, మల్లికార్జునరావు తెలిపారు.
Similar News
News November 9, 2025
భీమవరం: భక్త కనకదాసు జయంతి

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు శ్రీ భక్త కనకదాస జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త అని అన్నారు.
News November 8, 2025

ఈ నెల 12న జిల్లాలో వైసీపీ నిరసన ర్యాలీలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడుతున్నామని వైసీపీ పార్లమెంట్ అబ్జర్వర్ మురళీ కృష్ణంరాజు, భీమవరం ఇన్‌ఛార్జి వెంకట్రాయుడు తెలిపారు. శనివారం రాయలంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నెల రోజులుగా సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతోందని, దానిలో భాగంగా 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.