News May 12, 2024

పోలింగ్‌కు సర్వం సిద్ధం: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో సోమవారం జరిగే పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 1,711 పోలింగ్ స్టేషన్లు, 13.89 లక్షల మంది ఓటర్లు, నంద్యాల పార్లమెంట్‌కు 31మంది, అసెంబ్లీ నియోజకవర్గాలకు 126 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News November 4, 2025

ఆదోని మార్కెట్‌లో పత్తి ధర రూ.7,555

image

ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు నమోదయ్యాయి. పత్తి కనిష్ఠంగా రూ.4,000, గరిష్ఠంగా రూ.7,555 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.6,666, ఆముదాలు రూ.5,940 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోళ్లలో తేమ శాతం పేరుతో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

News November 4, 2025

జిల్లా అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులనున ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పీజీఆర్ఎస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, తాగునీరు, శానిటేషన్, వ్యవసాయం తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రజా సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.

News November 3, 2025

13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

image

13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ తెలిపారు. అక్టోబర్ 25న లీప్ యాప్‌లో అటెండెన్స్ మార్కు చేయని కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.