News February 24, 2025
పోలింగ్ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జడ్పీలో భద్రపర్చిన పోలింగ్ కిట్లను రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం పరిశీలించారు. మెటీరియల్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల సీరియల్ నెంబర్లు వేసి వాటిని పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్దం చేయాలని చెప్పారు. 26 నుంచి ఏసీ కళాశాలలో కిట్ల పంపిణీ కోసం ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని చెప్పారు.
Similar News
News February 25, 2025
గుంటూరులో లారీ ఢీకొని ఇద్దరు మృతి

గోరంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో లారీ ఢీ కొని ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. అమరావతి నుంచి గుంటూరు నగరంలోకి వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో నల్లపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
News February 25, 2025
మిర్చి రైతులకు మద్దతు ధర: మంత్రి లోకేశ్

రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం CBN చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి లోకేశ్ తెలిపారు. సోమవారం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేలా మిర్చి రైతులకు క్వింటా కనీస మద్దతు ధర రూ.11,781లు చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిందని మంత్రి అన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.
News February 25, 2025
పెదకాకాని మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: నాదెండ్ల

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో జరిగిన విద్యుదాఘాతం ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై సోమవారం ఓ ప్రకటనలో మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.