News May 11, 2024
పోలింగ్ కు సర్వం సిద్ధం: కలెక్టర్ హరి చందన

NLG పార్లమెంటు స్థానానికి మే 13న పోలింగ్ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరి చందన తెలిపారు. శుక్రవారం అమె మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్లమెంట్ పోలింగ్ జరుగుతుందన్నారు. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రం పరిధిలోని 100 మీటర్ల లోనికి వచ్చిన వాళ్లకి టోకెన్లు ఇచ్చి ఓటు వేయడానికి అవకాశం ఇస్తామన్నారు.
Similar News
News February 9, 2025
NLG: అంతటా రిజర్వేషన్లపైనే చర్చ..!

పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఓవైపు అధికారులు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తుంటే.. మరోవైపు కీలకమైన రిజర్వేషన్లపై ఇంకా ఉత్కంఠ వీడటం లేదు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా? లేదా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తుందా..? అనే దానిపై జిల్లా అంతటా ఆసక్తి నెలకొంది. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
News February 9, 2025
నల్గొండ: బస్సులో రూ.23 లక్షల చోరీ

నల్గొండ జిల్లాలో భారీ చోరీ జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడి బ్యాగు నుంచి రూ.23 లక్షలను ఎత్తుకెళ్లారు. నార్కెట్‌పల్లి వద్ద ఓ హోటల్‌లో టిఫిన్ చేసేందుకు ప్రయాణికులు దిగారు. అనంతరం బ్యాగు చూసుకుంటే మాయమైనట్లు బాధితుడు తెలిపాడు. దీంతో నార్కెట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News February 9, 2025
NKP: చెర్వుగట్టులో ఘనంగా పూర్ణాహుతి

చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి, ఏకాంత సేవలను వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, ఆర్చక బృందం ఆధ్వర్యంలో మహా పూర్ణహుతి, హోమం, ధ్వజారోహణం, ఏక దశ రుద్రాభిషేకం, జ్యోతి లింగార్చన, ఏకాంతసేవ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆయల ఈఓ నవీన్ కుమార్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.