News February 15, 2025
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన భువనగిరి కలెక్టర్

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
Similar News
News January 9, 2026
SBIలో 1,146 జాబ్స్.. ఒక్కరోజే ఛాన్స్

SBIలో 1,146 ఉద్యోగాలకు(కాంట్రాక్ట్) దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇందులో VP వెల్త్(SRM) 582, AVP వెల్త్(RM) 237, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 327 ఉన్నాయి. అభ్యర్థులకు డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. పోస్టును బట్టి 20-42ఏళ్ల వయసు ఉండాలి. జీతం VP వెల్త్కి ₹44.70L, AVP వెల్త్కి ₹30.20L, CREకి ₹6.20L వార్షిక జీతం చెల్లిస్తారు.
వెబ్సైట్: https://sbi.bank.in/
News January 9, 2026
కామారెడ్డి: రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు శనివారం నుంచి ఈనెల 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు జిల్లా DIEO షేక్ సలాం తెలిపారు. తిరిగి 19న కళాశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సెలవు దినాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా ప్రైవేటు విద్యాసంస్థలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 9, 2026
జుట్టుకు రంగేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

తెల్లజుట్టును దాయడానికే కాకుండా ఫ్యాషన్ కోసం కూడా జుట్టుకు రంగువేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముందు జుట్టు ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రఫ్, డ్రైగా ఉన్న జుట్టుకు రంగువేసినా సరిగ్గా అంటదు. ఎవరో చేశారని కాకుండా మీకు ఏ రంగు నప్పుతుందో చూసుకొని అదే వేసుకోవాలి. కలర్ వేసే ముందు హెయిర్లైన్ చుట్టూ వాజిలైన్ రాయాలి. చేతులకు గ్లోవ్స్ ధరించాలి.


