News February 17, 2025
పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం: కలెక్టర్

ఫిబ్రవరి 27న ఉమ్మడి కృష్ణా-గుంటూరు శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్‌ల పాత్ర కీలకమని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్‌ల శిక్షణ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.
Similar News
News March 19, 2025
CM తిరుపతి పర్యటన షెడ్యూల్ ఇదే..!

తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు రెండు రోజులు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి 8:35 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9:25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గాన తిరుమలకు బయల్దేరుతారు. రాత్రికి అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు వెళ్తారు.
News March 19, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాకు ఎల్లో WARNING

నాగర్‌కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ శాఖ మంగళవారం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను నమోదయ్యాయని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది. రాబోయే రెండు, మూడు రోజుల వరకు జిల్లాలో సుమారు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
News March 19, 2025
MBNR: GREAT.. ఓపెన్‌లో GOVT జాబ్ కొట్టాడు..!

TGPSC నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్షలో పాలమూరు విశ్వవిద్యాలయం పరిధి గద్వాలలోని పీజీ సెంటర్‌లో 2017-2019లో MA తెలుగు పూర్తి చేసిన S.రాకేశ్ రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటి ఓపెన్‌లో ఉద్యోగం సాధించారు. దీంతో యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్(VC), ప్రొఫెసర్ G.N.శ్రీనివాస్ రాకేశ్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, తెలుగు శాఖ అధ్యక్షురాలు డా.సంధ్యారాణి పాల్గొన్నారు.