News February 13, 2025

పోలింగ్ కేంద్రాల జాబితా అందజేత: అదనపు కలెక్టర్

image

రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు గురువారం హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జడ్పీ సీఈవో విద్యాలత అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చన్నారు.

Similar News

News November 16, 2025

ఆసిఫాబాద్: ప్రత్యేక లోక్ అదాలత్‌లో 842 కేసులు పరిష్కారం

image

కక్షిదారులు రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకుని డబ్బు, సమయం ఆదా చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.వీ రమేష్ సూచించారు. శనివారం ఆసిఫాబాద్‌లోని న్యాయస్థానంలో జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా వివిధ కోర్టుల్లోని 842 కేసులు పరిష్కారం అయ్యాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి పాల్గొన్నారు.

News November 16, 2025

సూర్యాపేట జిల్లాలో 25 వేల మంది దరఖాస్తుదారులు

image

చేయూత పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వివిధ కేటగిరీలకు చెందిన లబ్ధిదారులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు సమర్పించారు. సూర్యాపేట జిల్లాలో సుమారు 25 వేల దరఖాస్తులు మండల పరిషత్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి, పెండింగ్‌లో ఉన్న కొత్త పింఛన్లను మంజూరు చేయాలని దరఖాస్తుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News November 16, 2025

జగదాంబ జంక్షన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

జగదాంబ జంక్షన్‌లోని బస్‌స్టాప్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్ సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుని ఒంటిపై గాయాలు లేవని.. అయితే అనారోగ్యం కారణంగా చనిపోయాడా? ఇంకా ఏమైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని KGH మార్చురీకి తరలించామని అతని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని సీఐ కోరారు.