News February 26, 2025

పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు: ఎస్పీ

image

జిల్లాలోని గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ రూపేష్ బుధవారం తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉండాలని పేర్కొన్నారు. కేంద్రాల సమీపంలో ప్రచారం చేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News March 27, 2025

చోడవరంలో భయపడ్డ దొంగలు: ఎస్ఐ

image

చోడవరంలో పోలీసులకు భయపడిన దొంగలు దొంగిలించిన ఇంటిలోనే బంగారు వస్తువులు పడేసి పరారయ్యారు. PS పేటకి చెందిన కొల్లి లక్ష్మి మంగళవారం పొలానికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో ఉన్న 5 తులాల బంగారు వస్తువులను దోచుకున్నారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. SI నాగకార్తీక్ దర్యాప్తు చేపట్టారు. కాగా దొంగలు భయపడి దొంగిలించిన నగలను బుధవారం ఆ ఇంటిలోనే పడేసి పరారయ్యారని SI తెలిపారు.

News March 27, 2025

విజయనగరం జిల్లాపై సీఎం స్పెషల్ ఫోకస్

image

విజయనగరం జిల్లాలో సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రధాన ప్రాజెక్టులైన తోటపల్లికి రూ.105కోట్లు, తారకరామసాగర్‌కు రూ.807కోట్లు ఇవ్వనున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లాలోని సాగునీటి వనరులపై CM ఆరా తీశారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సెంట్రల్ ట్రైబుల్ యునివర్సిటీకి రూ.29కోట్లు ఇస్తామన్నారు.

News March 27, 2025

ఈ వీకెండ్ ఏ సినిమాకు వెళ్తున్నారు?

image

నేటి నుంచి ఈనెల 30 వరకు పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇవాళ మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ థియేటర్లలో సందడి చేయనుంది. రేపు ‘మ్యాడ్ స్క్వేర్‌’తో పాటు నితిన్-శ్రీలీల నటించిన ‘రాబిన్‌హుడ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈనెల 30న సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్'(హిందీ) కూడా విడుదల కానుంది. మరి ఈ వీకెండ్ మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు? కామెంట్ చేయండి.

error: Content is protected !!