News March 18, 2025
పోలింగ్ కేంద్రాల విభజనపై దృష్టి సారించాలి: బాపట్ల కలెక్టర్

ఓటర్లు అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాల విభజనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. పోలింగ్ కేంద్రాల విభజనపై రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల అధికారులతో బాపట్ల కలెక్టరేట్లో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,200 లకు మించి ఓటర్లు ఉండరాదనే నిబంధనలు ఉల్లంఘించరాదన్నారు. 1200కు పైగా ఓటర్లు ఉంటే మరొక కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News November 23, 2025
బీసీసీఐ ట్రోఫీకి సిద్దిపేట యువకుడు

బీసీసీఐ నిర్వహించే సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 ట్రోఫీ హెచ్‌సీఏ టీమ్‌లోకి సిద్దిపేటకు చెందిన క్రీడాకారుడు అర్ఫాజ్ అహ్మద్ ఎంపికయ్యారు. నవంబర్ 26 నుంచి కోల్‌కతాలో జరిగే ఈ టోర్నమెంట్లో అహ్మద్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కలకుంట్ల మల్లికార్జున్ హర్షం వ్యక్తం చేస్తూ అర్ఫాజ్కు శుభాకాంక్షలు తెలిపారు.
News November 23, 2025
రోజూ నవ్వితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌తో సతమతమవుతున్న వారికి నవ్వు ఉత్తమ ఔషధమని నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 15 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వితే శరీరానికి, మనసుకు అపారమైన లాభాలు కలుగుతాయి. నవ్వు ఒత్తిడిని తగ్గించి టైప్-2 డయాబెటిస్‌ను, బీపీని నియంత్రణలో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వు సహజ పెయిన్‌కిల్లర్‌లా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
News November 23, 2025
గనుల సీనరేజీ పాలసీని సరళీకృతం చేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

AP: వైసీపీ హయాంలో మైనింగ్‌పై ఆధారపడిన వారికి దినదినగండంగా గడిచిందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రస్తుతం ఈ రంగంలో పారదర్శకంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన గనుల సీనరేజీ పాలసీని త్వరలోనే సరళీకృతం చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లోనూ మైనింగ్ కార్యాలయాలు నిర్మిస్తామని వెల్లడించారు. ఇక నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ కొనసాగుతోందని, ఎంతటివారున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు.


