News February 26, 2025

పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధం: ASF కలెక్టర్

image

పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ASF కలెక్టరేట్‌లో బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. ఎన్నికల కొరకు ఆయా పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్‌లతో పాటు అదనంగా బాక్స్‌లను కేటాయించినట్లు చెప్పారు.

Similar News

News October 19, 2025

జనగామ: పదేళ్లలో అంబేద్కర్ ఓవర్సీస్‌కు 32 మంది ఎంపిక

image

విదేశాల్లో ఉన్నత చదువుకోవాలనే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా అర్హులైన విద్యార్థులు విదేశాల్లో చదువుకునేలా ప్రోత్సాహమిస్తోంది. అయితే జనగామ జిల్లా ఏర్పడిన పదేళ్లలో ఇప్పటి వరకు ఇక్కడి నుండి 32 మంది వివిధ దేశాల్లో విద్యను అభ్యసించారు. వారికి ప్రభుత్వం వారి చదువుల కోసం ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున అందజేసింది.

News October 19, 2025

VJA: రూ.1 లక్ష జీతంతో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి

image

విజయవాడలోని సీడాప్ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన స్టేట్ ప్రాజెక్టు మేనేజర్-ఎంటర్‌ప్రైజ్ డెవలప్మెంట్ (4) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. MBA పూర్తి చేసి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారు https://seedap.ap.gov.in/లో ఈ పోస్టులకు అక్టోబర్ 25లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడాలన్నారు. ఎంపికైన వారికి రూ.75 వేల నుంచి రూ. 1 లక్ష వేతనం ప్రతినెలా చెల్లిస్తామన్నారు.

News October 19, 2025

నిర్మల్: మద్యం దుకాణాలకు 942 దరఖాస్తులు

image

మద్యం దుకాణాలకు 942 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ తెలిపారు. జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించారు. శనివారం ఒక్కరోజే 529 దరఖాస్తులు వచ్చాయని ఇందులో భైంసా ఎక్సైజ్ పరిధిలో 186 దరఖాస్తులు రాగా నిర్మల్ ఎక్సైజ్ పరిధిలో 343 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. శనివారం రాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించారు.