News February 26, 2025

పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధం: ASF కలెక్టర్

image

పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ASF కలెక్టరేట్‌లో బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. ఎన్నికల కొరకు ఆయా పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్‌లతో పాటు అదనంగా బాక్స్‌లను కేటాయించినట్లు చెప్పారు.

Similar News

News March 26, 2025

MDK: హామీలను అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదు: హరీశ్ రావు

image

కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం మెదక్‌లో మాట్లాడుతూ.. రుణమాఫీ చేసిందని ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని, రుణమాఫీ కాని రైతులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు.

News March 26, 2025

కొడాలి నానికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

image

AP: మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యపరీక్షల సమయంలో గుండెలోనూ సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
(Article being continuously updated..)

News March 26, 2025

MNCL: రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తుల స్వీకరణ

image

జిల్లాలో రాజీవ్ యువ వికాస పథకం ద్వారా వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పురుషోత్తం తెలిపారు. ఆర్థిక పురోగతి పెంపొందించేందుకు అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 5లోపు https:// tgobmmsnew. cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

error: Content is protected !!