News July 1, 2024

పోలీసులు అనుమతి తప్పనిసరి: నిర్మల్ ఎస్పీ

image

నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా 30 పోలీస్ యాక్ట్‌ను సోమవారం నుంచి అమలుచేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈనెల 31 వరకు జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు, సభలు ,ర్యాలీలు నిర్వహించవద్దని శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News December 7, 2025

బోథ్: ఎన్నికల్లో ప్రలోభాలకు గురికావద్దు: ఎస్పీ

image

రానున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం రాత్రి బోథ్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి ఆయన ప్రజలతో మాట్లాడారు. ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎవరి బలవంతం ఓటుపై ఉండకూడదని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికలను పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News December 7, 2025

ADB: ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

image

త్రైమాసిక తనిఖీలో భాగంగా శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో గల ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఆయన గోదాం చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, అర్బన్ తహశీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు పంచాపూల, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.